అమ్మో వచ్చేసింది !

అమ్మో వచ్చేసింది !

ఎవరైనా పసికట్టేస్తారని భయం
ఒక్కటితో మొదలై ఆగిపోదని దడ

టీజ్ చేస్తారని కొందరు
పరువు పోతుందని మరికొందరు
ఇదేం తలనొప్పిరా అని ఇంకొందరు

అబ్బో అబ్బబ్బో ..

అప్పట్లో అంటే.. వయసు పై బడిన వారికే వచ్చేవి. కానీ ఇప్పుడు పొల్యూషన్ పాపమో, స్ట్రెసో, మరి ఇంకొకటో టీనేజ్ వారిని వదలడం లేదు. అదేనండి తెల్ల జుట్టు.

నెలకోసారో .. 15 రోజులకు ఒకసారో.
మరీ ఎక్కువ తెల్ల వెంట్రుకలు వచ్చి ఉంటే వారానికి ఓసారో.. వైట్ హెయిర్ ని కవర్ చేసుకోవాల్సి వస్తోంది. ఇక ఫంక్షన్స్, పార్టీలు, పండగలు, ఆఫీస్ లో మీటింగ్స్ ఉంటే డబల్ కోటింగ్.

యూత్ సంగతి పక్కన పెడితే.. మిడిల్ ఏజ్ వారు సరేసరి. ఒక్క తెల్ల వెంట్రుక తలపై మొలిస్తే చాలు .. టెన్షన్ పడిపోతారు. ఎవరైనా చూస్తే పరువు పోతుందని ఓవర్ గా ఫీల్ అవుతుంటారు. దాన్ని పీకేసో, రంగు వేసోగానీ వదిలిపెట్టరు.

ఇక కొంతమంది తాతలు, మామ్మలు కూడా తెల్ల జుట్టును నల్ల హెన్నా, ఎర్ర హెన్నాతో నిగనిగలాడిస్తుoటారు. వారికి అదో తృప్తి.

అలాని అందరూ నల్ల రంగు వెనక పడట్లేదు, కొంతమంది అన్ని రంగులను ట్రై చేస్తున్నారు. డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలా.

ఏ కొంతమంది మాత్రమో హెయిర్ డై జోలికి పోకుండా వయసు తెచ్చిన కొత్త అందాన్ని తెల్ల జుట్టులో చూసుకుంటున్నారు.

  • ♥మంజీత కుమార్ బందెల

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*