
హైదరాబాద్: స్వాతంత్ర్యం ముందు నుంచే తెలుగువారిని చైతన్యపరుస్తోన్న ఆధ్యాత్మిక మాసపత్రిక శ్రీరామకృష్ణ ప్రభ ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్నూ ప్రారంభించింది. రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానంద బోధనల సారాంశాన్ని ఆకట్టుకునేలా అందించేందుకు యత్నిస్తోంది.
యువతలో ఉన్న ఆందోళనను, అలజడిని, ఒత్తిడిని దూరం చేసి ఆధ్యాత్మిక, నైతిక విలువల ద్వారా సరైన మార్గం చూపేందుకు యూ ట్యూబ్ ద్వారా యత్నిస్తున్నామని శ్రీరామకృష్ణ ప్రభ సంపాదకులు స్వామి పరిజ్ఞేయానంద తెలిపారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల ప్రాధాన్యతను తెలియజేస్తూ చిన్నప్పటి నుంచే మంచి నడవడి అలవడేలా వీడియోలను రూపొందించేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. స్పూర్తిదాయక సందేశాల ద్వారా యువతను మేల్కొల్పేందుకు యత్నిస్తామన్నారు. రామకృష్ణ మఠానికి చెందిన స్వాములు, స్వచ్ఛంద సేవకులతో ఈ వీడియోలను రూపొందిస్తున్నారు. మరెందుకు ఆలస్యం శ్రీరామకృష్ణ ప్రభ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. విలువైన వీడియోలను ఉచితంగా వీక్షించి ప్రయోజనం పొందండి.
Be the first to comment