
ప్రతి సన్నివేశాన్ని తన సినిమా ప్రమోషన్ కి ఉపయోగించుకునే వర్మ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన ‘వల్లభనేని వర్సెస్ యలమంచిలి’ ఎపిసోడ్ ని కమ్మ రాజ్యం లో కడప రెడ్డ్లు సినిమా ప్రమోషన్ కి వాడేసుకున్నాడు వర్మ… ఇక అసలు విషయానికి వెళ్తే, ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ నిర్వహించిన లైవ్ డిబేట్ లో యలమంచిలి రాజేంద్రప్రసాద్ మరియు వల్లభనేని వంశీ పాల్గొన్నారు. ఈ డిబేట్ లో ఇద్దరు పోటాపోటిగా తిట్టుకున్నారు. డొక్కా పగులుద్ది… నోరు ముసుకోవోయ్ … ఎం చేస్తావ్ రా.. అంటూ ఇంకా చాలా పరుష పదాలు ఉపయోగిస్తూ లైవ్ డిబేట్ లో తిట్టుకున్నారు.
ఇలా వీరిద్దరు పోట్లాడుకోవడం మన వర్మ గారికి ఎంత గానో నచ్చినట్టు ఉంది కాబోలు. అందుకే ఏకంగా త్వరలో విడుదల కాబోతున్న ‘కమ్మ రాజ్యం లో కడప రెడ్డ్లు’ సినిమాకి సీక్వెల్ కూడా ప్రకటించేసాడు వర్మ ట్విట్టర్లో…ఈ సినిమా సీక్వెల్ సినిమా టైటిల్… ‘కడప రెడ్డి రాజ్యానికి కమ్మ ఫాన్స్’. ఎంతైనా ఇలాంటి డైరెక్టర్ దొరకడం ప్రొడ్యూసర్స్ పాలిట అదృష్టమే కదా. ఎందుకంటారా సినిమాకి కావాల్సినంత ప్రమోషన్ తీసుకురావడంలో వర్మకు పరిపాటి ఎవరు ఉండరేమో అంటే అతిశయోక్తి కాదు.
After seeing the fiery Vallabhaneni Vamsi’s interviews, I got an idea for a sequel to KAMMA RAJYAMLO KADAPA REDDLU …it is going to be titled REDDY RAJYANIKI KAMMA FANS #KRKR
— Ram Gopal Varma (@RGVzoomin) November 16, 2019
ఇలా సాగుతుంటే వల్లభనేని వంశీ నేడు ప్రెస్ మీటింగ్ పెట్టి మాలధారణ చేసిన తనను పరుషపదజాలం ఉపయోగిచందం వల్లనే తాను కూడా అలా మాట్లాడవలసి వచ్చిందని వివరణ ఇవ్వబోయాడు.. వయసులో పెద్దవాడైన రాజేంద్రప్రసాద్ కి క్షమాపణలు కూడా చెప్పాడు. ఇంతలో మీరు పార్టీ మరుతున్నారు కదా.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నలకు మొదట జాతీయ పార్టీ లోకి వెళ్ళిన వాళ్ళతో రాజీనామా చేపిస్తారా..? టిడిపి పార్టీ మొన్న ఎన్నికల్లో ఓడిపోయింది కదా నారా లోకేష్ ఎమ్మెల్సీ పదవిలోనే కొనసాగుతున్నాడు మీరు రాజీనామా చేపిస్తారా.. అంటూ విలేకురులకు ఎదురు ప్రశ్నలు వేసారు వల్లభనేని వంశీ. అయినా ఇలాంటి పదవులు తనకేం అవసరం లేదు అంటూ వంశీ అనడం కొసమెరుపు…
శ్రీనివాస్, రచన జర్నలిజం కాలేజ్, నారాయణగూడ, హైదరాబాద్
Be the first to comment