తమిళ రాజకీయాల్లో కీలక మలుపు… కలిసి పోటీ చేయనున్న కమల్-రజినీ

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమని మక్కల్ నీతి మయ్యమ్ అధినేత కమల్ హాసన్ సంకేతాలు ఇచ్చారు. రాజకీయంగా అవసరమైతే రజనీకాంత్‌తో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కమల్ ప్రకటించారు. తమిళనాడు ప్రజల శ్రేయస్సు కోసం తాను రజనీకాంత్ తో చేతులు కలుపుతానని ఆయన అన్నారు. తమిళనాడు ప్రజల బాగు కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

తనతో చేతులు కలిపేందుకు సిద్ధమన్న కమల్ ప్రకటనపై రజినీ స్పందించారు. గంటన్నరలోనే తన నిర్ణయాన్ని ప్రకటించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు ఓకే చెప్పారు. దీంతో తమిళనాట రాజకీయాలు అనూహ్య మలుపు తీసుకున్నాయి. కమల్ హాసన్, రజినీ కలిస్తే డీఎంకేకు చెక్ పెట్టినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత లేని అన్నాడీఎంకేకు లోక్‌సభ ఎన్నికల్లో గట్టి పరాభవం ఎదురైంది. డీఎంకే కాంగ్రెస్ ఎక్కువ సీట్లను కైవసం చేసుకున్నాయి. దీంతో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేకు రజినీ కమల్ కాంబినేషన్ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.

-N.Shrikanth, Rachana Journalism College, Hyderabad.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*