
ముంబై: మహారాష్ట్ర సీఎంగా మరోసారి ప్రమాణం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ విశ్వాస పరీక్ష గెలవగలరా? ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న ఇదే. ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అయితే 288 మంది ఎమ్మెల్యేలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో అధికారం చేపట్టడానికి కావాల్సిన 145 మంది ఎమ్మెల్యేల మ్యాజిక్ నెంబర్‌ను ఎలా సాధించగలరనేది ఉత్కంఠగా మారింది.
మహారాష్ట్రలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 288
బీజేపీ బలం 105
అజిత్ పవార్ వెంట వచ్చిన ఎమ్మెల్యేలు 22
ఫడ్నవీస్‌కు మద్దతిస్తామంటోన్న ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు 15
ఫడ్నవీస్ ప్రభుత్వానికి మద్దతిస్తామంటోన్న చిన్న పార్టీల ఎమ్మెల్యేల సంఖ్య 8
మొత్తం కలిపితే 150 అవుతుంది.
కావాల్సిన మ్యాజిక్ నెంబర్ 145
అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన బలం ఉన్నట్లే లెక్క. అయితే గవర్నర్ ఆదేశించగానే ఫడ్నవీస్ బలం నిరూపించుకోగలిగితే పర్వాలేదు. లేదంటే సర్కారు చిక్కుల్లో పడుతుంది. శివసేనకు చెందిన 19 మంది ఎమ్మెల్యేలు ఫడ్నవీస్‌కు మద్దతిచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని సమాచారం. వీరంతా సాయంత్రం భేటీ అవుతున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44, ఇతరులు 29 చోట్ల గెలిచారు. బీజేపీతో కలిసి కూటమిగా పోటీ చేసిన శివసేన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వకుండా యూపిఏ పంచన చేరింది. కాంగ్రెస్, ఎన్సీపీతో చేతులు కలిపింది. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర సంప్రదింపులు జరిపారు. అయితే సీఎం పదవితో పాటు ఇతర మంత్రిత్వ శాఖలపై ఏకాభిప్రాయం కుదరలేదు. చివరకు ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో బీజేపీ సంకీర్ణ సర్కారు ఏర్పడింది.
అసలు తెరవెనుక ఏం జరిగింది?
ఓ పక్క శివసేన తమను వీడి దూరం జరగడంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై ఆశలు వదులుకున్నట్లేనని అంతా భావించారు. అయితే బీజేపీ ఉత్తిగా ఏం కూర్చోలేదు. ప్రధాని మోదీతో పవార్ భేటీ అవడంతోటే రాజకీయ పరిశీలకులు ఏదో జరగబోతోందని ఊహించారు. అయితే అజిత్ పవార్ బయటకు వెళ్లి బీజేపీకి మద్దతిచ్చే ఫార్ములాపై అప్పుడు చర్చించారా లేదా అనేది మాత్రం తెలియలేదు. అయితే అజిత్ పవార్…. శరద్ పవార్‌కు తెలిసే బయటకు వచ్చారా లేక బయటకు వచ్చేశారా అనేది తెలియాల్సి ఉంది.
అజిత్ పవార్ బయటకు వెళ్లి ఫడ్నవీస్ సర్కారుకు మద్దతీయడంతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ షాక్‌కు గురయ్యాయి.
अजित पवार यांच्या राजकीय निर्णयाला राष्ट्रवादी काँग्रेस पक्षाचा पाठिंबा नाही.
हा त्यांचा वैयक्तिक निर्णय आहे.— Sharad Pawar (@PawarSpeaks) November 23, 2019
మరి కొద్ది గంటల్లో ఉద్ధవ్ సీఎంగా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని అంతా ఆశించారు. అయితే ఇంతలోనే తెరవెనుక బీజేపీ అధిష్టానం జరిపిన యత్నాలు ఫలితాలిచ్చాయి.
मैं महाराष्ट्र की जनता को सरकार बनने की बधाई देता हूं। ये प्रजातंत्र की जीत है।
महाराष्ट्र में @Dev_Fadnavis जी के नेतृत्व में एक स्थिर सरकार बनेगी और राज्य के विकास में तेजी आएगी: श्री @JPNadda pic.twitter.com/zteSxaxf5g
— BJP (@BJP4India) November 23, 2019
అమిత్ షా, ఫడ్నవీస్, నద్దా… పవార్‌ను ఎన్సీపీ నుంచి విజయవంతంగా బయటకు తీసుకురాగలిగారు. అంతేకాదు శివసేనలోనూ చీలిక తీసుకువచ్చే యత్నాలు ముమ్మరం చేశారు. అమిత్ షా, ఫడ్నవీస్, నద్దా వ్యూహాత్మకంగా అడుగులు వేశారని, తెలివిగా సంప్రదింపులు జరిపారని సమాచారం. తద్వారా శివసేనకు, కాంగ్రెస్ పార్టీకి గట్టిగా షాక్ ఇచ్చారని కూడా పరిశీలకులు చెబుతున్నారు.
श्री @Dev_Fadnavis जी को महाराष्ट्र के मुख्यमंत्री और श्री @AjitPawarSpeaks को प्रदेश के उपमुख्यमंत्री के रूप में शपथ लेने पर हार्दिक बधाई।
मुझे विश्वास है कि यह सरकार महाराष्ट्र के विकास और कल्याण के प्रति निरंतर कटिबद्ध रहेगी और प्रदेश में प्रगति के नये मापदंड स्थापित करेगी।
— Amit Shah (@AmitShah) November 23, 2019
ఫడ్నవీస్ సర్కారును గట్టెక్కేందుకు అమిత్ షా మంతనాలు ముమ్మరం చేశారు. ఇండిపెండెంట్లతోనూ, చిన్నచితకా పార్టీలతోనూ ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. ఎన్సీపీ, శివసేనతో పాటు కాంగ్రెస్ నుంచి కూడా కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచ్చే అవకాశం ఉందని సమాచారం.
అమిత్ షా వ్యూహం ఫలిస్తుందా లేదా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
This post is also available in : English
Be the first to comment