మహారాష్ట్రలో మహాట్విస్ట్.. అజిత్ పవార్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మహా ట్విస్ట్. ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్‌ ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ వీరిచేత ప్రమాణం చేయించారు.

మహారాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం జట్టు కట్టిన ఫడ్నవీస్, అజిత్ పవార్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా అభినందించారు..

అయితే బీజేపీ ప్రభుత్వానికి మద్దతివ్వాలనేది అజిత్ పవార్ సొంత నిర్ణయం అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44, ఇతరులు 29 చోట్ల గెలిచారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 145 స్థానాలు ఎవ్వరికీ రాకపోవడంతో సందిగ్ధత ఏర్పడింది. ఈ తరుణంలో బీజేపీతో కలిసి కూటమిగా పోటీ చేసిన శివసేన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వకుండా యూపిఏ పంచన చేరింది. కాంగ్రెస్, ఎన్సీపీతో చేతులు కలిపింది. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర సంప్రదింపులు జరిపారు. అయితే సీఎం పదవితో పాటు ఇతర మంత్రిత్వ శాఖలపై ఏకాభిప్రాయం కుదరలేదు. చివరకు ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో బీజేపీ సంకీర్ణ సర్కారు ఏర్పడింది.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*