ప్రపంచ రికార్డులు సృష్టిస్తోన్న భాగ్యనగర బాలిక

హైదరాబాద్: భాగ్యనగరానికి చెందిన ఎనిమిదేళ్ల పిడివి సహృద ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. ఎలైట్ ప్రపంచ రికార్డుల సంస్థ ఆమోదం పొందిన రెండు రికార్డులను కైవసం చేసుకుంది.

వ్యక్తిగతంగా అత్యధిక సంఖ్యలో ఆరిగామి రకాలను 20 నిమిషాలలో (102) చేసినందుకుగాను అలాగే పింగాని పలకలను (350) 20నిమిషాల వ్యవధిలో పగలగొట్టి చరిత్ర సృష్టించింది. ఇంతకు ముందు ఈ వి భాగంలో ఒక ఉత్తర కొరియా దేశస్తుడి పేరిట రికార్డు ఉంది.
తాను మూడు ప్రపంచ రికార్డులకు పోటీ పడగా రెండింటిని గెలుచుకోగా ఇతర జాతీయ, రాష్ట్రస్థాయి రికార్డులను కైవసం చేసుకున్నానని సహృద తెలిపింది.

తాను ప్రపంచ స్థాయి కరాటే పోటిల్లో(2017) రెండో స్థానంలో నిలిచానని ఆమె గురువు అశ్విని ఆనంద్ తెలిపారు. సహృదను ప్రపంచ స్దాయి పోటిలకు సిద్దం చేస్తున్నానన్నారు.

-అనుదీప్, రచన జర్నలిజం కళాశాల, హైదరాబాద్.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*