పుకార్లపై క్లారిటీ కోసం వెయిట్ చేయండి: అనసూయ

హైదరాబాద్ : జబర్దస్త్ కామెడీ షో టీం నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించి నాగబాబు షాక్‌కు గురిచేసిన గంటల్లోనే జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఈ షో నుండి బయటకు వచ్చేస్తారనే పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ పుకార్లపై అనసూయ మండిపడ్డారు. ఆ దేవుడి దయ వల్ల తాను జబర్దస్త్ అనసూయగా చాలా బాగున్నానని చెప్పారు. పుకార్లపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని చెప్పారు.

అదే సమయంలో …త్వరలో జీ టీవీలో తన కార్యక్రమం రానుందంటూ అనసూయ ట్వీట్ చేశారు.

“దయచేసి నా నుండి వచ్చే సున్నితమైన సమాధానాలు వినండి నేను ఇచ్చే సమాధానాలు వాళ్లని శాంత పరుస్తుంది. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో వాళ్లకి బాగా తెలుసు. “స్టాప్ జాబ్ లెస్ న్యూస్, గెట్ లైఫ్” అని ఘాటుగా సమాధానం ఇచ్చారు.

-Vinitha yathakula, Rachana College Of Journalism, Narayanaguda, Hyderabad.(9030522882)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*