24 గంటల్లో ఫడ్నవీస్ బలపరీక్ష.. సర్వత్రా ఉత్కంఠ

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో 24 గంటల్లోగా బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నెల 27 సాయంత్రం 5 గంటలలోపు విశ్వాసపరీక్ష పూర్తి చేయాలని స్పస్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రొటెం స్పీకర్ ఈ బల పరీక్ష నిర్వహిస్తారు. విశ్వాసపరీక్ష వీడియో రికార్డింగ్ చేస్తారు. టీవీ ఛానెళ్లలో లైవ్ టెలీకాస్ట్ ఉంటుంది.

మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో గెలుపొందాయి. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో అధికారం చేపట్టాలంటే 145 స్థానాలు తప్పనిసరి. ఏ పార్టీకి అధికారం చేపట్టేందుకు కావాల్సిన 145 స్థానాలు రాకపోవడంతో సందిగ్ధత ఏర్పడింది. వాస్తవానికి బీజేపీ, శివసేన ఒక కూటమిగా, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేశాయి. అయితే ఫలితాలు వచ్చిన వెంటనే శివసేన బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చి ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమితో చేతులు కలిపింది.

ప్రభుత్వ ఏర్పాటుపై అన్ని పార్టీలూ ఓ వైపు సంప్రదింపులు జరుగుతుండగానే ఎన్సీపీ శాసనసభాపక్ష నేత అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలిపారు. ఆ వెంటనే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. దీనిపై కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం ఆదేశాల మేరకు ఈ నెల 27న విశ్వాస పరీక్ష జరగనుంది.

 

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*