
ముంబై: ఎన్సీపీ శాసనసభాపక్ష నేత అజిత్ పవార్‌తో చేతులు కలిపి పొరపాటు చేశామని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. సరైన సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానన్నారు.
న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ టీవీ సమావేశంలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ అజిత్ పవార్ శాసనసభాపక్ష నేతగా తన వెంట మెజార్టీ ఎమ్మెల్యేలు వస్తారని చెప్పి తనకుతానుగా మద్దతిచ్చారని చెప్పారు. అంతేకాదు అజిత్ పవార్‌కు ఎలాంటి క్లీన్చిట్ ఇవ్వలేదని, కేసులు ఎత్తివేయలేదని, మీడియా పుకార్లు ప్రచారం చేసిందన్నారు.
అటు అజిత్ పవార్ బీజేపీనుంచి బయటకు వచ్చాక ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలుసుకున్నారు. ఆ సమయంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులే కూడా ఉన్నారు. సుప్రియా సులే అజిత్ పవార్ కాళ్లకు దండం పెట్టారు. ఈ సందర్భంగా అజిత్ పవార్ మాట్లాడుతూ తానెప్పుడూ ఎన్సీపీని వీడలేదని, ఎన్సీపీలోనే ఉన్నానని చెప్పారు.
మరోవైపు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి సీఎంగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే గురువారం సాయంత్రం ప్రమాణం చేయనున్నారు. అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలంతా నేడు అసెంబ్లీలో ప్రమాణం చేశారు.
Be the first to comment