
హైదరాబాద్ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం విలేకరుల కుటుంబ సభ్యుల గెట్ టుగెదర్( సమ్మేళనం) నిర్వహిస్తారు. ఈసారి జలవిహార్ లో కన్నుల పండుగగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఒక గ్రామీణ వాతావరణాన్ని, చిన్ననాటి జ్ఞాపకాలని, అప్పటి ఆటలను గుర్తు చేసుకునేలా ఆట-పాటలను నిర్వహించారు. పెద్దలు, చిన్నలు అన్న తేడా లేకుండా ఆట పోటీల్లో పాల్గొన్నారు. ఆట లో గెలుపొందిన వారికి బహుమతులను ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో పాపులర్ సెలబ్రిటీగా వెలుగుతున్న బిత్తిరి సత్తి, ఆంధ్ర ప్రదేశ్ జాతీయ మీడియా సలహాదారుడు అమర్ దేవులపల్లి, సీనియర్ జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జర్నలిస్టుల కుటుంబ సభ్యులతో ఎంతో ఆహ్లాదంగా, చూడముచ్చటగా జలవిహార్ కనిపించింది
.శివాని రెడ్డి, రచన జర్నలిజం కళాశాల, హైదరాబాద్.
Be the first to comment