
గోదావరిఖని: మహిళలు.. విద్యార్థినులపై దాడుల నేపథ్యంలో తమను తాము రక్షించుకునేందుకు పెద్దపల్లికి చెందిన పులిగిల్ల రవీందర్ మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నారు. విద్యార్థినుల్లో మనోధైర్యాన్ని నింపేందుకే ప్రత్యేకంగా కరాటేలో శిక్షణ ఇస్తున్నారు. గోదావరిఖని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో (కాయ్) కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనుబంధమైన కరాటే అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తగరపు శంకర్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ కరాటే శిక్షణ నిర్వహించింది. ఈ సందర్భంగా ఏసీపీ ఉమేందర్ మాట్లాడుతూ…మహిళలు, విద్యార్థినులకు పూర్తి స్థాయి భద్రతను ఏర్పాటు చేస్తామని, వారు భయపడాల్సిన అవసరం లేద భరోసా ఇచ్చారు.
కరాటే అసోషియేషన్ అఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి తగరపు శంకర్ మాట్లాడుతూ.. కరాటేతో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం ఉంటుందన్నారు. అదేవిధంగా ధైర్యం పెంపొందుతుందని చెప్పారు. పోలీస్ శాఖ నిర్ణయం మేరకు కరాటే శిక్షణ నిరంతరం ఇస్తామని చెప్పారు.
Be the first to comment