
బెంగళూరు: కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 66.25 శాతం పోలింగ్ నమోదైంది. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేలపై న్యాయస్థానాల్లో వ్యాజ్యాలున్నాయి. దీంతో సభలో మొత్తం సభ్యులు 222. మ్యాజిక్ నెంబర్ 112. ప్రస్తుతం బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. స్పీకర్‌తో పాటు మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా కమలం పార్టీకి మద్దతిస్తున్నారు. ప్రస్తుత ఉప ఎన్నికల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిస్తేనే బీజేపీకి మెజార్టీ ఉంటుంది. లేదంటే యెడ్యూరప్ప సర్కారు కూలిపోయే ప్రమాదం ఉంది. బీజేపీ నుంచి ఆరుగురు గెలవకపోతే ప్రభుత్వం మైనార్టీలో పడిపోయి విశ్వాస పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి 66, జేడీఎస్‌కు 34 మంది ఎమ్మెల్యేలున్నారు.
ಇಂದಿನ ಉಪಚುನಾವಣೆಗೆ ಮುಖ್ಯಮಂತ್ರಿ @BSYBJP ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಹಗಲಿರುಳು ಶ್ರಮಿಸಿದ ಪಕ್ಷದ ಕಾರ್ಯಕರ್ತರು, ಸಚಿವರು, ಶಾಸಕರು, ನಾಯಕರು ಹಾಗೂ ಬೆಂಬಲಿಗರಿಗೆ ಮನದಾಳದಿಂದ ಧನ್ಯವಾದಗಳನ್ನು ಅರ್ಪಿಸುತ್ತೇನೆ.
ರಾಜ್ಯದ ಜನತೆಯ ಪ್ರೀತಿ ಹಾಗು ಆಶೀರ್ವಾದದೊಂದಿಗೆ ಬಿಜೆಪಿ ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಈ ಮಹತ್ವವಾದ ಚುನಾವಣೆ ಗೆಲ್ಲುವುದು ಖಚಿತ. pic.twitter.com/bIzjMo1Crr
— BJP Karnataka (@BJP4Karnataka) December 5, 2019
14 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ సభ్యుల రాజీనామాలతో కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్- జేడీఎస్ సర్కారు కూలిపోయింది. బీజేపీకి మద్దతుగా నిలుస్తూ రాజీనామాలు చేసిన సభ్యులను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. దీంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. 15 నియోజకవర్గాల్లో జరిగిన ఉపఎన్నికల ఫలితాలు ఈ నెల 9న వెలువడనున్నాయి. దీంతో అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Be the first to comment