దిశ నిందితుల ఎన్‌కౌంటర్

హైదరాబాద్: డాక్టర్ దిశ హత్య కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. నలుగురు నిందితులను పోలీసులు కాల్చివేశారు. దిశను చంపిన దగ్గరే నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. నలుగురు నిందితులను సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం సంఘటన స్థలమైన చటాన్ పల్లికి గురువారం రాత్రి తీసుకొచ్చారు. దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితుడైన ఆరిఫ్ తమపై దాడి చేయడంతో మిగతా ముగ్గురు కూడా తిరగబడ్డారు అని పోలీసులు తెలిపారు. తమ దగ్గర ఉన్న తుపాకులను లాక్కునేందుకు యత్నించడంతో పాటు రాళ్లతో దాడి చేస్తూ పారిపోయే ప్రయత్నం చేశారని దీంతో నిందితులపై కాల్పులు జరిపామని తెలిపారు. ఈ ఘటన తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్యలో జరిగిందని తెలిపారు.

పోలీసుల పై సోషల్ మీడియాలో ప్రశంసలు:

దిశ హత్య కేసులో నిందితులకు వెంటనే శిక్ష పడాలని, ఉరి తీయాలని ఎంతో మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేశారు. ఇప్పుడు నిందితులు ఎన్కౌంటర్లో చనిపోవడంతో సోషల్ మీడియాలో పోలీసుల పై ప్రశంసల జల్లు కురుస్తోంది. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

శ్రీకాంత్, రచన జర్నలిజం కళాశాల, హైదరాబాద్.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*