హైదరాబాద్ టీ20లో ఘన విజయం సాధించిన భారత్

హైదరాబాద్: t-20 సిరీస్ లో భాగంగా హైదరాబాద్ లో జరిగిన మొదటి టి-20లో టీమిండియా విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్ల కు ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదన ను ప్రారంభించిన టీమిండియా 18.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు.

ఓపెనర్ రోహిత్ 8(10 బంతులలో 1/4) త్వరగా అవుట్ అయిన మరో ఓపెనర్ రాహుల్, కోహ్లీతో కలిసి విండీస్ బౌలర్ల ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టానికి 50 పరుగులు చేశారు.వీరిద్దరూ రెండో వికెట్ కు 100 పరుగులు జోడించారు. రాహుల్ 62(40 బంతులలో 5/4,4/6) ల సహకారంతో కెప్టెన్ కోహ్లి 94(50 బంతులలో 6/4,6/6) వీరోచిత బ్యాటింగ్ తో టీమిండియాకు అపూర్వ విజయాన్ని అందించారు. కోహ్లీ దాటికి ఒక్క కాట్రెల్ తప్ప విండీస్ బౌలర్లలో ఎవరు నిలువలేక పోయారు. విలియమ్సన్ ఒక్కడే 20 బంతుల్లో 60 పరుగులు సమర్పించుకున్నాడు.

మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ పవర్ ప్లే ముగిసేసరికి 66 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. లూయిస్ 40(17 బంతులలో 3/4,4/6) భారత బౌలర్లను పరుగులు పెట్టించాడు. హిట్ మేయర్ 56(41 బంతులలో 2/4,4/6) కు తోడు కెప్టెన్ పొలార్డ్ 37(19 బంతులలో 1/4,4/6) పరుగులు చేశారు. వీరిద్దరూ ఏడు ఓవర్లలోనే 70 పరుగులు జత చేశారు. 18వ ఓవర్లో chahal వీరిద్దరిని వెనక్కి పంపి పరుగుల ప్రవాహాన్ని నిలువరించే ప్రయత్నం చేసిన హోల్డర్ 24 (9 బంతులలో 1/4,2/6) పరుగులతో విండీస్ స్కోర్ ను 200 దాటించాడు. భారత బౌలర్లలో చాహల్ కు రెండు వికెట్లు, జడేజా, చాహర్, సుందర్ లకు తలా ఓ వికెట్ లభించింది.

ఈ మ్యాచ్ లో నమోదైన ఎకనామి రేట్ 7.5 ఈ సంవత్సరం టి-20లో భారత్ తరఫున ఇదే అత్యంత చెత్త ఎకనామి. ఈ మ్యాచ్ లో భారత ఫీల్డింగ్ అత్యంత పేలవమైన ప్రదర్శనతో సగటు అభిమాని నిరాశపరిచింది.
ఇలాంటి వికెట్ ను తయారు చేయడం వల్ల బౌలర్లలో ఆత్మస్థైర్యం దెబ్బతిని ప్రమాదం ఉంది అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

-మారుతి ఆజాది, జ్యోతి జగన్నాథం దడిగా
రచన జర్నలిజం కళాశాల. నారాయణగూడ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*