
దిశ హంతకుల ఎన్కౌంటర్పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.ఘటనపై మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
“దిశ సంఘటనలో నిందితులు పోలీసు కాల్పుల్లో మృతిచెందారన్న వార్తను ఉదయం చూడగానే నిజంగా ఇది సత్వర న్యాయం , సహజ న్యాయం అని నేను భావించాను. కామంతో కళ్లు మూసుకుపోయి ఇలాంటి నేరాలు, ఘోరాలు చేసే ఎవరికైనా ఇది కనువిప్పు కలిగించాల్సిందే. అత్యంత దారుణం గా అత్యాచారానికి, హత్యకు గురైన ‘దిశ’ ఆత్మకు శాంతి చేకూరినట్లయింది. కడుపుకోతతో బాధపడుతున్న ‘దిశ’ తల్లిదండ్రుల ఆవేదనకు ఊరట లభించినట్లయింది. ఆడపిల్లల్ని ఆటవస్తువుగా పరిగణించి వారిపై దారుణమైన ఆకృత్యాలకు పాల్పడే మానవ మృగాలకు ఇదో గుణపాఠం కావాలి! ఇటువంటి అత్యాచార సంఘటనలు పునరావృత్తం కాకుండా నేరస్థుల వెన్నులో వణుకు పుట్టాలి. వారం రోజుల వ్యవధిలోనే ఈ వ్యవహారం కొలిక్కి రావడం అభినందనీయం. సజ్జనార్ గారి లాంటి పోలీస్ ఆఫీసర్లు వున్న పోలీస్ వ్యవస్థకి, కెసిఆర్ గారి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా అభినందనలు” అన్నారు మెగాస్టార్ చిరంజీవి.
Be the first to comment