
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అనాజ్మండిలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో 44 మంది చనిపోయారు. తొలుత ఓ భవనంలో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత సమీపంలోని ఇళ్లలో అక్రమంగా నిర్వహిస్తున్న ప్లాస్టిక్ ఫ్యాక్టరీ కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. చాలామంది నిద్రలోనే కన్నుమూశారు. ఎన్డీఆర్ఎఫ్ సహాయక సిబ్బంది ఇప్పటివరకూ 56 మందిని రక్షించి సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మృతుల బంధువుల రోదనలతో అటు అనాజ్మండిలోనూ, ఆసుపత్రుల వద్ద కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి.
మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని చేపట్టాలని ఆదేశించారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలంటూ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు.
PM @narendramodi announced an ex-gratia of Rs. 2 lakh each from PMNRF for the next of kin of those who have lost their lives due to the tragic fire in Delhi.
PM has also approved Rs. 50,000 each for those seriously injured in the fire.
— PMO India (@PMOIndia) December 8, 2019
The fire in Delhi’s Anaj Mandi on Rani Jhansi Road is extremely horrific. My thoughts are with those who lost their loved ones. Wishing the injured a quick recovery. Authorities are providing all possible assistance at the site of the tragedy.
— Narendra Modi (@narendramodi) December 8, 2019
ఘటనలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు.
Tragic loss of precious lives in the fire accident in New Delhi. My deepest condolences with families of those who have lost their loved ones. I pray for the early recovery of the injured.
Have instructed concerned authorities to provide all possible assistance on urgent basis.
— Amit Shah (@AmitShah) December 8, 2019
మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని, క్షతగాత్రులకు 25 వేల రూపాయల నగదు సాయం చేస్తామని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి చెప్పారు.
रानी झांसी रोड पर अनाज मंडी में आग लगने से हुई दर्दनाक मौतों पर बेहद दुखी हूं। मैं दिवंगत परिवारों के प्रति संवेदना प्रकट करता हूँ।
मैं भी अभी वहाँ पहुँच रहा हूँ।मेरी @BJP4Delhi के कार्यकर्ताओं से अपील है कि वहाँ पहुंच कर लोगों की मदद करें।
— Manoj Tiwari (@ManojTiwariMP) December 8, 2019
ఘటనపై కేజ్రీవాల్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. క్షతగాత్రులకు లక్ష రూపాయల పరిహారం అందిస్తామని, ఆసుపత్రి ఖర్చు భరిస్తామని తెలిపింది. ఘటనపై సీఎం కేజ్రీవాల్ విచారణకు ఆదేశించారు.
We have lost more than 40 innocent lives to the tragic fire. I've ordered a magisterial inquiry into its cause, no culprit will be spared
We can't bring back lost lives, but Delhi govt will provide ₹10 L assistance to families that lost their loved ones & ₹1 L for the injured. pic.twitter.com/SOT5kR9l5J
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 8, 2019
శైలజ పాలకూర్ల, రచన జర్నలిజం కళాశాల. హైదరాబాద్.
This post is also available in : English
Be the first to comment