పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించిన లోక్‌సభ.. షాపై మోదీ ప్రశంసల జల్లు

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు, వ్యతిరేకంగా 80 ఓట్లు వచ్చాయి. బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశ పెట్టాక ప్రతిపక్ష సభ్యులు చర్చలో పాల్గొన్నారు. అనేక సందేహాలను లేవనెత్తారు. చర్చకు సమాధానమిచ్చిన షా అందరి సందేహాలనూ తీర్చారు. బిల్లు ఆమోదం పొందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఎంపీలందరికీ ధన్యవాదాలు తెలిపారు.

బిల్లును బుధవారం రాజ్యసభలో ప్రవేశపెడతారు.

బిల్లు రాజ్యసభలో కూడా ఆమోదం పొందితే పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో మత పీడనకు గురై భారత్‌కు శరణార్ధులుగా వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం లభిస్తుంది. ఈ మూడు దేశాల నుంచి 2014 డిసెంబర్ 31వ తేదీలోపు వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులను అక్రమ వలసదారులుగా పరిగణించరు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*