
ముంబై: చిరుత విందుకు హాజరు అవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజంగా ఆశ్చర్య పడవలసిన విషయమే. మహారాష్ట్రలోని పింపలగోవాన్లో ఈ సంఘటన జరిగింది. కుటుంబ సభ్యులు రాత్రి భోజనం చేస్తుండగా హఠాత్తుగా ఒక చిరుత వారి ఇంట్లోకి చొరబడింది. వారి పెంపుడు కుక్క తో పాటు చిరుతపులి ఇంట్లోకి వచ్చింది.
అప్రమత్తమైన వారు వెంటనే తెలివిగా చిరుతను గదిలో పెట్టి గడియ వేశారు. ఈ వింత చూడటానికి చుట్టుపక్కల వారు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రెస్క్యూ టీం వచ్చి తలుపు తెరవగా చిరుత కబోర్డ్ మీదికెక్కి కూర్చొని ఉంది. వారు చిరుతను బంధించి ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అడవిలో వదిలి వేశారు.
-శైలజ పాలకూర్ల
Be the first to comment