పౌరసత్వ సవరణల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా రాజ్యసభలో 125, వ్యతిరేకంగా 105 ఓట్లు పడ్డాయి. అంతకంటే ముందు బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలా వద్దా అనే అంశంపై జరిగిన ఓటింగ్‌లో పంపవద్దంటూ 124 ఓట్లు పడ్డాయి. ప్రతిపక్షాల సవరణలు కూడా వీగిపోయాయి. ఈ బిల్లు ఇప్పటికే లోక్‌‌సభ ఆమోదం పొందింది.

మరోవైపు రాజ్యసభలో బిల్లుకు మద్దతిచ్చిన పార్టీల్లో బీజేపీకి అత్యంత సన్నిహితంగా ఉంటున్న అన్నాడీఎంకే, జేడీయూ, బీజేడీ, టీడీపీ, వైసీపీ, ఎల్‌జేపీ ఉన్నాయి.


పౌరసత్వ సవరణల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.


అటు కాంగ్రెస్ పార్టీ మాత్రం బిల్లుకు పార్లమెంట్ ఆమోదం పొందడంపై విచారం వ్యక్తం చేసింది. బిల్లు ఆమోదం పొందిన రోజు చీకటి రోజని సోనియా అభిప్రాయపడ్డారు.

పౌరసత్వ సవరణల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపాక రాష్ట్రపతి సంతకం కోసం పంపారు. రాష్ట్రపతి ఆమోదం పొందాక చట్టం అమల్లోకి వస్తుంది. ఇది అమల్లోకి వస్తే కోట్లాది మంది భారత శరణార్ధులకు భారత పౌరసత్వం లభిస్తుంది. వీరంతా పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌లో మతపీడనకు గురై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భారత్‌కు వచ్చారు. అయితే 70 ఏళ్లుగా వీరికి భారత పౌరసత్వం లభించలేదు. ఎట్టకేలకూ భారత పౌరసత్వం లభించడంతో శరణార్ధులు పండగ చేసుకుంటున్నారు.

– సుధారాణి, రచన జర్నలిజం కళాశాల, హైదరాబాద్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*