
ముంబై: వెస్టిండీస్‌తో ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన చివరి టీ20లో భారత్ 67 పరుగులతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 241 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఆరంభలోనే 3 వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కోలుకోలేకపోయింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు మాత్రమే చేయగలిగింది. వెస్టిండీస్ ఆటగాళ్లలో హెట్మెయిర్ 41, పొలార్డ్ 68 పరుగులు చేశారు.
https://twitter.com/BCCI/status/1204814110614945800
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 71, రాహుల్ 91, కోహ్లీ 70 పరుగులు చేశారు. మూడో టీ20లో విజయం ద్వారా భారత్ 2-1తో సిరీస్ గెలుచుకుంది.
It's all over! #TeamIndia beat West Indies in the 3rd T20I to win the series 2-1? #INDvWI @Paytm pic.twitter.com/REXorDu5KP
— BCCI (@BCCI) December 11, 2019
Be the first to comment