గొల్లపూడి మరణంతో మూగబోయిన సినీ పరిశ్రమ

చెన్నై: సుప్రసిద్ధ రచయిత, నటుడు, జర్నలిస్టు, కాలమిస్టు, బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నై ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమ మూగబోయింది.

గొల్లపూడి మారుతీ రావు 1939 ఏప్రిల్ 14న విజయనగరం జన్మించారు. 42వ ఏట గొల్లపూడి నటించిన మొదటి చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఆఖరి చిత్రం జోడి. మారుతీ రావు ఆరు సార్లు నంది పురస్కారం అందుకున్నారు.

నవలలు, నాటకాలు వందలాది వ్యాసాలతో సాహిత్యరంగంలోనూ విశేష సేవలు అందించారు. రౌడీ ఫెలో కంచె, సైజ్ జీరో, ఇజం, మురారి, లీడర్, అభిలాష లాంటి ఎన్నో చిత్రాల్లో గొల్లపూడి నటించారు.

గొల్లపూడి మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

– వర్షిణి, రచన జర్నలిజం కళాశాల, హైదరాబాద్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*