
ఇస్లామాబాద్: పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు ఆ దేశ ప్రత్యేక కోర్టు మరణ శిక్ష విధించింది. 2013లో దాఖలైన దేశ ద్రోహం కేసులో ఆయన్ను దోషిగా తేలుస్తూ తీర్పు చెప్పింది. పాక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 ప్రకారం ముషారఫ్‌కు ముగ్గురు సభ్యుల ప్రత్యేక ధర్మాసనం ఈ శిక్ష విధించింది. ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటోన్న ముషారఫ్ మరికాసేపట్లో కోర్టు తీర్పుపై స్పందిస్తారని సమాచారం. ముషారఫ్ గతంలో సైన్యాధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
Be the first to comment