వైభవంగా దివ్యజనని శ్రీ శారదామాత జయంతి వేడుకలు

హైదరాబాద్: రామకృష్ణ మఠంలో దివ్యజనని శ్రీ శారదామాత 167వ జయంతి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. తెల్లవారుజామున ఐదున్నరకు ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ధ్యానం, సుప్రభాతం, మంగళారతి, భజనల అనంతరం ఆరున్నరకు ఆలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు భజనలు చేస్తూ నృత్యాలు చేశారు. ఏడుంబావుకు విశేష పూజ, లలితా
సహస్రనామ పారాయణం, భజనలు చేశారు. అనంతరం 11 గంటలా 15 నిమిషాలకు హోమం నిర్వహించారు. 12 గంటలకు దివ్యజనని శ్రీ శారదాదేవి జీవితం-సందేశంపై హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి జ్ఞానదానంద ప్రసంగించారు. మధ్యాహ్నం 12 గంటలా 50 నిమిషాలకు విశేష హారతి అనంతరం మధ్యాహ్నం భక్తులకు భోజన ప్రసాదం అందించారు.

ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు దివ్యజనని శ్రీ శారదాదేవి చలనచిత్రాన్ని వివేకానంద ఆడిటోరియంలో ప్రదర్శించారు.

సాయంత్రం ఆరు గంటలకు ఆరాత్రికం, ఏడుంబావుకు ప్రత్యేక భజనలు చేశారు.

శారదామాత జయంతి సందర్భంగా పుస్తకాలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించారు. తెలుగు పుస్తకాలపై 40 శాతం, ఇంగ్లీష్ పుస్తకాలపై 20 శాతం డిస్కౌంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద సాహిత్యం కొనేందుకు భక్తులు పోటీ పడ్డారు.

-అనుదీప్, హైదరాబాద్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*