‘సిరినోము’ సంగీత సత్కారం

December 18, హైదరాబాద్: శాంతా- వసంతా ట్రస్ట్, బాపు- రమణ యూ-ట్యూబ్ ఛానల్ సంయుక్తంగా సమర్పిస్తున్న, తెలుగు తిరుప్పావై, సిరినోముల పాటల పండుగ – ‘మేలిపలుకుల మేలుకొలుపులు’ మహోత్సవం, డిసెంబర్ 18వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు, స్థానిక తెలుగు విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ సభాగారంలో జరుగుతుంది. పవిత్రమైన ధనుర్మాసంలో ఆండాళ్ తల్లి, ఆ విష్ణుమూర్తిని తన భర్తగా పొందేందుకు నోచిన నోము కొరకు పాడిన పాటలని తిరుప్పావై పాశురాలు అనవచ్చు. శ్రీ ముళ్లపూడి వెంకటరమణ, వీటిని తమిళం నుంచి, తేట తెలుగులోకి అనువదించగా, అవి, 2007 వ సంవత్సరంలో, పుస్తక రూపంలో ప్రచురింపబడ్డాయి.ఇటీవల, 13 మంది ప్రముఖ సంగీత దర్శకులు, ఆ పాశురాలకు బాణీలు కూర్చి, పాటల రూపంలో ప్రముఖ గాయనీ గాయకులతో పాడించారు. ఈ సాయంత్రం కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమౌతోంది. కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు తెలియచేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*