విశాఖ వన్డేలో భారత్ ఘన విజయం

వైజాగ్: విశాఖ వన్డేలో భారత్ 107 పరుగులతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 387 పరుగుల విజయలక్ష్యాన్ని చేరుకోవడంలో వెస్టిండీస్ తడబడింది. 43.3 ఓవర్లలో విండీస్ 280 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బ్యాట్స్‌మెన్‌లో రోహిత్ శర్మ 159 పరుగులు, కేఎల్ రాహుల్ 102, పంత్ 39, అయ్యర్ 56 పరుగులు చేశారు.

విండీస్ బ్యాట్స్‌మెన్‌లో హోప్ 78, నికోలస్ 75, పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్‌ చేశారు. షమీ 3, జడేజా 2, ఠాకూర్ 1 వికెట్లు తీశారు.

సిరీస్ ఫలితాన్ని తేల్చనున్న కీలకమైన చివరి వన్డే కటక్‌లో ఈ నెల 22న జరగనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*