వైభవంగా జరిగిన వల్లాల శ్రీశైలం తనయుడి మ్యారేజ్ రిసెప్షన్

వైభవంగా జరిగిన వల్లాల చిన్న శ్రీశైలం యాదవ్ తనయుడు ప్రవీణ్ కుమార్ యాదవ్(వెంకట్ యాదవ్) మ్యారేజ్ రిసెప్షన్‌
ప్రముఖ నాయకులు వల్లాల చిన్న శ్రీశైలం యాదవ్ తనయుడు ప్రవీణ్ కుమార్ యాదవ్(వెంకట్ యాదవ్), మహితశ్రీల వివాహం డిసెంబర్ 6వతేదీన సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ అండ్ జువెల్ గార్డెన్స్‌లో ఘనంగా జరిగింది. కాగా బుధవారం హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో మ్యారేజ్ రిసెప్షన్ వేడుక‌ను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాంప్రదాయ వాయిద్యాలు ఓ వైపు, మ్యూజికల్ నైట్ మరో వైపు సభా ప్రాంగణాన్ని ఆటపాటలతో హోరెత్తించాయి. ఆశేష జన సముద్రం నడుమ సాగిన ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని నవదంపతులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్, దిల్ రాజు, ఎన్. శంకర్, బి. గోపాల్, సి. కళ్యాణ్, అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, సుమన్, భానుచందర్, బాబూ మోహన్, హీరో మంచు మనోజ్, హీరో అశ్విన్, రాహుల్ యాదవ్ నక్కా, జీవితా రాజశేఖర్, హేమ, కరాటే కళ్యాణి, సాయిరామ్ శంకర్, రామసత్యనారాయణ మొదలగు సినీ ప్రముఖులు.. లగడపాటి రాజగోపాల్, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, చింతల రామచంద్ర రెడ్డి మొదలగు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*