
హైదరాబాద్: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం తాత్కాలిక ప్రాతిపదికన పని చేసేందుకు న్యూస్ ఎడిటర్లు, రిపోర్టర్లు(తెలుగు), న్యూస్ రీడర్లు( తెలుగు, ఉర్దూ) పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడిగించింది. ఈ నెల 23 వరకూ తేదీని పొడిగించారు.
హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో నివసించేవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్ధుల ఎంపిక జరుగుతుంది. న్యూస్ రీడర్లు ఆడిషన్ (వాయిస్ టెస్ట్)లో కూడా ఉత్తీర్ణత సాధించాలి.
ఆసక్తిగల అభ్యర్ధులు వివరాల కోసం www.newsonair.com వెబ్సైట్లో (Vacancies) విభాగం చూడాలని ఆల్ ఇండియా రేడియో రీజనల్ న్యూస్ యూనిట్ అధిపతి, ఉప సంచాలకులు తెలిపారు.
మరిన్ని వివరాలకు 040-23234282 నెంబర్కు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఫోన్ చేయవచ్చు.
Be the first to comment