ఆర్‌కే మఠ్‌లో వివేకానంద జన్మతిథి వేడుకలు.. అందరికీ ఆహ్వానం

హైదరాబాద్: స్వామి వివేకానంద జన్మతిథి వేడుకలు జనవరి 17న నగరంలోని రామకృష్ణమఠంలో జరగనున్నాయి. ఈ వేడుకలు ఉదయం 5.30 గంటల నుంచి సాయంత్రం 7.15 గంటల వరకు కొనసాగనున్నాయి. ఉదయం 5.30 గంటలకు ధ్యానం, సుప్రభాతం, మంగళారతి, భజనలు జరుగుతాయి. ఆ తర్వాత 6.30 గంటలకు దేవాలయ ప్రదక్షిణ, 7.30 గంటలకు విశేష పూజ, భజనలు ఉండగా.. 11.30 గంటలకు హోమం జరగనుంది.

మధ్యాహ్నం 12.00 గంటలకు స్వామి వివేకానంద జీవితం, సందేశంపై స్వామి జ్ఞానదానంద ప్రసంగించనున్నారు. ఆ తర్వాత 12.30 గంటలకు విశేష ఆరతి ఇస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.00 గంటలకు భోజన ప్రసాద కార్యక్రమం ఉంది. మధ్యాహ్నం 2.30 గంటలకు వివేకానంద ఆడిటోరియంలో స్వామిజీ జీవితం ఆధారంగా రూపొందించిన చలనచిత్ర ప్రదర్శన ఉంటుంది. ఇక ఆఖరుగా సాయంత్రం 6.45 గంటలకు అరాత్రికం, 7.15 గంటలకు ప్రత్యేక భజనలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ముఖ్యంగా యువతీయువకులు పెద్ద ఎత్తున హాజరుకాగలరని కోరుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*