వివేకానందుని జన్మతిథి.. తరలి వచ్చిన యువత

హైదరాబాద్: నగరంలోని దోమలగూడ రామకృష్ణమఠంలో స్వామి వివేకానంద జన్మతిథి వేడుకలు ఘనంగా జరిగాయి. యువతీయువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తెల్లవారుజామున ప్రారంభమైన వేడుకలు.. సాయంత్రం వరకు అట్టహాసంగా సాగాయి. ఉదయం 5.30 గంటలకు ధ్యానం, సుప్రభాతం, మంగళారతి, భజనలు జరగగా.. ఆ తర్వాత 6.30 గంటలకు దేవాలయ ప్రదక్షిణ, 7.30 గంటలకు విశేష పూజ, భజనలు జరిగాయి.

11.30 గంటలకు హోమం, మధ్యాహ్నం 12.00 గంటలకు స్వామి వివేకానంద జీవితం, సందేశంపై స్వామి జ్ఞానదానంద ప్రసంగించారు. ఆ తర్వాత 12.30 గంటలకు విశేష ఆరతి ఇచ్చారు. అనంతరం మధ్యాహ్నం 1.00 గంటలకు భోజన ప్రసాద కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం 2.30 గంటలకు వివేకానంద ఆడిటోరియంలో స్వామిజీ జీవితం ఆధారంగా రూపొందించిన చలనచిత్రాన్ని ప్రదర్శించారు.

ఇదిలా ఉంటే.. రామకృష్ణమఠం సాహిత్యం తక్కువ ధరకే సందర్శకులకు అందించారు. 20-40శాతం డిస్కౌంట్‌తో పుస్తకాలు లభ్యమయ్యాయి. తెలుగు పుస్తకాలపై 40శాతం డిస్కౌంట్ లభించగా.. ఇంగ్లీష్ పుస్తకాలపై 20 శాతం రాయితీ లభించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*