‘ట్రంప్ పర్యటనలో దేశానికి వచ్చేదేమీ లేదు’

 

మహారాష్ట్ర: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తన  పర్యటన వల్ల దేశానికి వచ్చేది ఏమీ లేదని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యానించారు. ట్రంప్ రాక వల్ల దేశంలో పేదలు, మధ్య తరగతి కుటుంబాల్లో మార్పు ఏమీ రాదు అని అన్నారు.

ట్రంప్ 36గంటల పర్యటన కోసం మురికివాడలను కనిపించకుండా చేయడం ఏంటని ఉద్ధవ్ థాక్రే ప్రశ్నించాడు. పేదరికాన్ని దా చాల్సిన అవసరం లేదని, అభివృద్ధిని చూపించాలని ఉద్ధవ్ థాక్రే స్పష్టం చేశారు.

ఇవాళ్టి ట్రంప్ భారత్ షెడ్యూల్:
ఇవాళ ట్రంప్ మోతేరా స్టేడియంలో నమస్తే ట్రంప్ ప్రోగ్రాంలో ప్రసంగించనున్నారు.

తర్వాత మధ్యాహ్నం 3.30 గంటలకు ఆగ్రా కు బయలుదేరుతున్న ట్రంప్. సాయంత్రం 4.45 కు ఆగ్రా కు చేరుకోనున్న ట్రంప్ దంపతులు.
సాయంత్రం 5.10 గంటలకు తాజ్ మహల్ ను సందర్శించనున్న ట్రంప్.

సాయంత్రం 6.45 గంటలకు ఆగ్రా నుంచి బయలుదేరనున్న ట్రంప్.

రాత్రి 8 గంటలకు ఢిల్లీ మౌర్య హోటల్ కు ట్రంప్ చేరుకోనున్నాడు.

 

-నెల్లికొండి శ్రీకాంత్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*