కరోనాకు మందు తయారు చేసి విడుదల చేసిన బాబా రాందేవ్

హరిద్వార్: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారికి బాబా రాందేవ్ సారధ్యంలోని పతంజలి యోగపీఠం తయారుచేసి విడుదల చేసింది. దివ్య కరోనా కిట్(కోరోనిల్) పేరుతో దీన్ని నేడు విడుదల చేశారు. తాము తయారు చేసిన కోరోనిల్ వాడితే ఐదు నుంచి 14 రోజుల్లో కరోనానుంచి విముక్తి లభిస్తుందని రాందేవ్ బాబా ప్రకటించారు. తులసి, అశ్వగంధ తదితర 150కి పైగా ఆయుర్వేద ఔషధ మొక్కలను వాడినట్లు పతంజలి సంస్థ ప్రకటించింది.

జైపూర్ నిమ్స్ వైద్యులతో పాటు పలువురు శాస్త్త్రవేత్తల సహకారంతో దీన్ని రూపొందించామని రాందేవ్ చెప్పారు. అనేకమంది దీన్ని వాడి బాగయ్యారని రాందేవ్ తెలిపారు. క్లినికల్ కంట్రోల్ స్టడీ, క్లినికల్ కంట్రోల్ ట్రయల్ చేశాకే తాము ఈ మందును మార్కెట్లో విడుదల చేశామని చెప్పారు. తమ మందు వాడిన రోగులు ఎవ్వరూ చనిపోలేదని, అందరూ వంద శాతం కోలుకున్నారని రాందేవ్ చెప్పారు. మూడు రోజుల్లోనే 69 శాతం మంది కోలుకుని పాజిటివ్ నుంచి నెగెటివ్ వచ్చారని తెలిపారు. 7 రోజుల్లోనే పూర్తి స్థాయిలో నెగెటివ్ అయ్యరని హర్షధ్వానాల మధ్య రాందేవ్ ప్రకటించారు. శ్వాసకోశ వ్యవస్థను సరిచేస్తూనే కరోనా లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి తగ్గిస్తుందని చెప్పారు. కరోనిల్ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుందని రాందేవ్ చెప్పారు. రానున్న సోమవారం తాము యాప్ విడుదల చేస్తామని, కావాల్సిన వారు యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఇంటినుంచే మందు తెప్పించుకోవచ్చని తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*