
హైదరాబాద్: రామకృష్ణ మఠంలో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్లెన్స్ ఆధ్వర్యంలో ఆన్లైన్ మెడిటేషన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. జులై ఆరున ప్రారంభమయ్యే ఈ యోగ వేదాంత మెడిటేషన్ క్లాసులు ఈ నెల 11 వరకు జరుగుతాయి. ఉదయం ఎనిమిదిన్నర నుంచి తొమ్మదిన్నర వరకూ క్లాసులు జరుగుతాయి. 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వయసు వారు ఆన్లైన్ తరగతులకు హాజరుకావొచ్చు. కరోనా వేళ ఇంటినుంచి బయటకు వెళ్లలేని తరుణంలో అంతరంగంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాలని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్లెన్స్ డైరక్టర్ స్వామి బోధమయానంద భక్తులకు చెబుతున్నారు.
ఆర్కే మఠ్లో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులు ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు.
మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.
Be the first to comment