ఒక్కసారిగా లడక్‌లో ప్రత్యక్షమైన మోదీ… చైనాకు వెన్నులో వణుకు

లడక్: చైనాతో ఓ పక్క ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లడక్‌ పర్యటనకు వెళ్లారు. త్రిదళాధిపతి బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవణేతో కలిసి ఆయన లడక్‌లో పర్యటిస్తున్నారు.

జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో చైనా బలగాల దాడిలో గాయపడి లేహ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారత సైనికులను మోదీ పరామర్శించనున్నారు. భారత్ తరపున చైనా సైన్యంతో చర్చలు జరుపుతున్న లెఫ్టెనెంట్ జనరల్ హరీందర్ సింగ్ మోదీకి తాజా పరిస్థితులు వివరించారు. సైన్యం సన్నద్ధతపై మోదీ వివరాలడిగి తెలుసుకున్నారు.

మోదీ ఒక్కసారిగా లడక్‌లో ప్రత్యక్షమవడంతో చైనాకు వెన్నులో వణుకుపుట్టింది. ఇటీవలే మోదీ చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించి చైనా నడ్డి విరిచారు. మోదీ పర్యటన భారత సైనిక బలగాల నైతిక స్థైర్యం పెంచడానికే అయినా చైనాకు మాత్రం అంతుచిక్కడం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక చైనా అధినాయకత్వం జుట్టు పీక్కుంటోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*