చైనా బలగాల దాడిలో గాయపడిన జవాన్లకు మోదీ పరామర్శ

లేహ్: జూన్ 15న గల్వాన్ ఘటనలో గాయపడిన జవాన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. లేహ్ ఆసుపత్రిని సందర్శించి జవాన్లను కలుసుకున్నారు. జూన్ 15 నాటి ఘటన గురించి సైనికులనడిగి వివరాలు తెలుసుకున్నారు. సైనిక బలగాల నైతిక స్థైర్యాన్ని పెంచారు.

అంతకు ముందు మోదీ లడక్‌లో సైనికులను ఉద్దేశించి మాట్లాడారు.

తాము శ్రీకృష్ణుడి పిల్లనగ్రోవి సంగీతాన్ని ఆస్వాదిస్తామని, అదే సమయంలో శతృవుపై సుదర్శన చక్రం ప్రయోగించిన కృష్ణుడినీ ఆరాధిస్తామని మోదీ చెప్పారు. విస్తరణ వాదం ముగిసిందని ప్రస్తుతం అభివృద్ధి వాదం నడుస్తుందని చైనాకు మోదీ చురకలంటించారు. భారత సైనికుల సాహసాలను కొనియాడారు.

లడక్ గల్వాన్ లోయలో జూన్ 15న బలగాల ఉపసంహరణ సమయంలో చైనా బలగాలు కుట్ర చేశాయి. 20 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్నాయి. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. చైనా యాప్‌లను నిషేధించడం ద్వారా భారత్ తన నిరసన తెలియజేసింది. చైనాతో వాణిజ్య కలాపాలు జరపరాదని కూడా నిర్ణయించుకుంది. అదే సమయంలో ఎల్‌ఏసీ వెంబడి భారత్ పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించింది. 3500 కిలోమీటర్ల పొడవునా భారత యుద్ధ విమానాలు, సైనిక హెలికాఫ్టర్లు నిఘా పెంచాయి. అంతర్జాతీయంగా చైనాను ఏకాకిని చేసేందుకు మోదీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*