బీజేపీ కార్యకర్తకు ఉండితీరాల్సిన ఏడు సలక్షణాలివే: మోదీ

న్యూఢిల్లీ: ప్రతి బీజేపీ కార్యకర్తకు ఉండితీరాల్సిన ఏడు సలక్షణాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు. తాము అధికారంలోకి వచ్చింది దేశానికి, పేదలకు సేవ చేయడానికేనని మరోసారి ఆయన స్పష్టంచేశారు. సేవా హి సంఘటన్ పేరుతో ఆయన బీజేపీ కార్యకర్తలతో ఆన్‌లైన్ ద్వారా ముచ్చటించారు. తమ ప్రభుత్వం ఆరేళ్లుగా ఇదే మంత్రంతో పనిచేస్తోందని మోదీ చెప్పారు. తామెప్పుడూ వ్యక్తిగత లాభం కోసం పనిచేయలేదన్నారు. నిస్వార్ధ సేవే తమ సంకల్పమని, సంస్కారమని మోదీ చెప్పారు.

బీజేపీ కార్యకర్తకు ఉండితీరాల్సిన ఏడు సలక్షణాలివే

సేవా భావం
సంతులనం
సంయమనం
సమన్వయం
సకారాత్మకత
సద్భావన
సంవాదం

కరోనా వేళ సమాజం కోసం, పేదల కోసం పనిచేయాలని ప్రధాని బీజేపీ కార్యకర్తలకు సూచించారు. సేవ చేయడం ద్వారా వచ్చే శక్తి కార్యకర్తలను ఎప్పటికీ అలసిపోయేలా చేయదని చెప్పారు. అందరి కోసం, అందరితో కలిసి, అందరి అభివృద్ధి లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని మోదీ చెప్పారు. తమకు దేశమే ముందని ఆ తర్వాతే ఏదైనా అని మోదీ పునరుద్ఘాటించారు.

ప్రధాని మోదీ ప్రసంగం ప్రతి బీజేపీ కార్యకర్తలో నూతనోత్సాహం నింపిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*