ఘనంగా శ్రీ సాంస్కృతిక కళాసారథి అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనం

సింగపూర్: సింగపూర్‌లో ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సంస్థ ఆవిర్భావ సందర్భంగా, ప్రారంభోత్సవ కార్యక్రమంగా ప్రతిష్ఠాత్మకమైన ‘అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనం’ నిర్వహించారు. 14 దేశాలకు ప్రాతినిథ్యం వహిస్తూ సుమారు 50 మంది సాహితీవేత్తలు మరియు సాహిత్యాభిమానులు వక్తలుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జూమ్ అంతర్జాల మాధ్యమం ద్వారా ఐదున్నర గంటల పాటు నిర్వహించబడిన ఈ కార్యక్రమాన్ని ఫేస్‌బుక్, మరియు యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆసక్తికరంగా సాగిన ఈ తెలుగు సాహిత్యారాధనలో, వక్తలు తమ వ్యాసాలను కవితలను కథలను పద్యాలను పాటలను మాలికలుగా అల్లి తెలుగు కళామతల్లిని అలంకరించి అర్చించారు.

https://www.youtube.com/watch?v=fEDvE3TH6n0&feature=youtu.be

శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థకు మరియు కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులకు తన శుభాభినందనలను ఆశీస్సులను అందజేస్తూ సామవేదం షణ్ముఖ శర్మ తమ వీడియో సందేశాన్ని, గరికిపాటి నరసింహారావు ఆడియో సందేశాన్ని అందించారు. భారతదేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సభకు సంస్థకు శుభాభినందనలు అందజేస్తూ లేఖను పంపారు. 14 దేశాల నుండి అంతర్జాలం ద్వారా ఈ విధమైనటువంటి కార్యక్రమం జరగడం ఇదే మొదటిసారి కావడంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈ సదస్సు స్థానం సంపాదించుకుంది అని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అధ్యక్షులు వెంకటాచారి తెలియజేశారు. తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి దీపారాధన చేసి విద్యాధరి శ్రీమతి లక్ష్మీ వినాయక ప్రార్థనతో పాటు మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయం ఆలపించడంతో కార్యక్రమం ప్రారంభమైంది. విశిష్ట అతిథిగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పాల్గొని, తమ సందేశాన్ని అభినందనలను అందజేశారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు, సాహిత్యకారులు వంగూరి చిట్టెన్ రాజు, ప్రముఖ సినీ సంగీత విశ్లేషకులు మ్యూజికాలజిస్ట్ రాజా గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. అభినవ లళకుశులు కంభంపాటి సోదరులు, రెలారెరేలా జానకీరావు పాటలతో అలరించారు. తెలుగు సంస్కృతి గొప్పతనం ఇతివృత్తంగా, రాధాకృష్ణ ఆధ్వర్యంలో సింగపూర్ లోని తెలుగు వారందరూ కలసి నిర్మించిన ‘అలా సింగపురంలో..’ అనే లఘుచిత్రం ట్రైలర్ మరియు ఆస్ట్రేలియా నుంచి ఉమా మహేష్ రచించిన ‘అక్షరోద్యమం’ అనే పుస్తకాన్ని ఈ సభాముఖంగా ఆవిష్కరించారు. ఖతార్ దక్షిణాఫ్రికా, ఒమాన్, జర్మనీ, సౌదీ అరేబియా మొదలైన దేశాల నుండి పలు రచయితలు ఈ కార్యక్రమం వేదిక ద్వారా తమ రచనలను పంచుకున్నారు.

సింగపూర్ నుంచి భాస్కర్, అరుణ్ , రాధాకృష్ణ, శిల్ప, ప్రావీణ్య, స్వాతి, శ్రీనివాస్ జాలిగామ, లక్ష్మి ప్రసాద్ రెడ్డి, రాధా శ్రీనిధి, వేణు మాధవ్, పాటూరి రాంబాబు మొదలగువారు, ఆస్ట్రేలియా నుంచి కొంచాడ రావు, న్యూజిలాండ్ నుంచి జగదీశ్వరరెడ్డి దంపతులు, హాంగ్ కాంగ్ నుంచి జయ, యూకె నుండి జొన్నలగడ్డ మూర్తి, మలేషియా నుంచి అచ్చయ్య కుమార్ రావు, కువైట్ నుంచి వీర నరసింహ రాజు, భరత భూమి నుంచి లావణ్య, సూర్యప్రకాశరావు, ఆదిత్య, శశాంక్ శివ శంకర్ తదితరులు మరియు ఖతార్ దక్షిణాఫ్రికా, ఒమాన్, జర్మనీ, సౌదీ అరేబియా మొదలైన దేశాల నుండి పలు రచయితలు ఈ కార్యక్రమం వేదిక ద్వారా తమ రచనలను పంచుకున్నారు. కవుటూరు రత్న కుమార్ ముఖ్య నిర్వాహకులుగా, భాస్కర్ సాంకేతిక సహాయకులుగా, రాధిక వ్యాఖ్యాతగా, శ్రీధర్, శ్రీ రామాంజనేయులు, రాంబాబు, శ్రీ సుధాకర్, నిర్వాహక వర్గ సభ్యులుగా , తమ నిర్వహణ సామర్థ్యంతో, కార్యక్రమం అంతా నిరాటంకంగా నిబద్ధతతో నడిపించారు. ఈ కార్యక్రమం ద్వారా అనుకున్నదానికంటే ఎక్కువగా అనూహ్యమైన స్పందన లభించిందని, ‘శ్రీ సాంస్కృతిక కళాసారధి’ సంస్థ ద్వారా ఇంకా చక్కటి వేదికలు ఏర్పాటు చేసి వర్ధమాన కళాకారులను రచయితలను ప్రోత్సహించడానికి, సాంస్కృతిక ఆధ్యాత్మిక కళా రంగాలలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి ప్రయత్నిస్తామని నిర్వాహకులు తెలిపారు

"శ్రీ సాంస్కృతిక కళాసారథి" వారి ఆధ్వర్యంలో సింగపూర్ నుండి అంతర్జాలం వేదికగా, జలై 5న తొలిసారిగా నిర్వహింపబడుతున్న "అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనం" ప్రత్యక్ష ప్రసారం

Posted by Sri Samskrutika Kalasaradhi, Singapore on Wednesday, July 1, 2020

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*