మోదీ దూకుడుతో తోకముడిచిన చైనా… టెంట్లు, వాహనాలతో డ్రాగన్ తిరుగుముఖం

లడక్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూకుడు వ్యూహం ఫలించింది. దీంతో గల్వాన్, గోగ్రా సహా అన్ని కీలక పాయింట్ల నుంచి చైనా బలగాలు తిరుగుముఖం పట్టాయి. టెంట్లు తొలగించాయి. వాహనాలతో సహా వెనక్కు మళ్లాయి. కమాండర్ స్థాయి చర్చల్లో నిర్ణయించుకున్నట్లుగానే చైనా బలగాలు రెండు కిలోమీటర్లు వెనక్కు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

జూన్ 15న గల్వాన్ లోయలో 20 మంది భారత జవాన్లను చైనా పొట్టనపెట్టుకున్నప్పటి నుంచీ దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. దీంతో చైనాకు వాస్తవాధీన దగ్గర గట్టిగా బదులు చెప్పాలని కేంద్రం నిర్ణయించింది. ఎల్‌ఏసీ వద్ద భారీగా సైన్యాన్ని మోహరించింది. యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లతో 3500 కిలోమీటర్ల మేర నిఘా పెంచింది. అదే సమయంలో చైనాను ఆర్ధికంగా కూడా దెబ్బతీసే చర్యలను భారత్ ప్రారంభించింది. టిక్‌టాక్, షేర్ ఇట్ తదితర 59 యాప్‌లను నిషేధించడంతో పాటు చైనాతో వాణిజ్య కార్యకలాపాలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వయంగా మోదీ లడక్‌లో పర్యటించి సైనిక బలగాల నైతిక స్థైర్యాన్ని పెంచారు. చైనా బలగాల దాడిలో గాయపడిన జవాన్లను పరామర్శించారు. మోదీ నాయకత్వంలో భారత సైన్య పరాక్రమాన్ని చూసిన చైనా క్రమంగా వెనక్కు తగ్గుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*