
బెంగళూరు: కర్ణాటక మాండ్య ఎంపీ సుమలతకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్ ద్వారా వెల్లడించారు. తలనొప్పి, గొంతునొప్పి వంటి లక్షణాలు కనపడటంతో తాను జులై నాలుగున కరోనా టెస్టులు చేయించుకున్నానని ఆమె తెలిపారు. టెస్టుల్లో పాజిటివ్ వచ్చిందని చెప్పారు. తన నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా తనకు కరోనా సోకినట్లు తేలిందన్నారు. తనను ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవాలని డాక్టర్లు సూచించారని, దాని ప్రకారమే తాను హోం క్వారంటైన్ అయ్యానని ఆమె చెప్పారు.
Dear friends,
I had developed mild symptoms of headache and throat irritation on Saturday, July 4. I decided to get tested as I might have been exposed to COVID-19 during the course of my constituency duties and tours. (1/n)— Sumalatha Ambareesh 🇮🇳 ಸುಮಲತಾ ಅಂಬರೀಶ್ (@sumalathaA) July 6, 2020
కొద్ది రోజులుగా తనతో టచ్‌లో ఉన్నవారు వెంటనే కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆమె సూచించారు. భగవంతుడి ఆశీస్సులతో కోవిడ్‌పై విజయం సాధించగలమని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
By the grace of God ,My immunity levels are strong and I am confident that I will get through this soon with all your support. I have provided details of the persons who I might have come into contact with to Govt Authorities. (3/n)
— Sumalatha Ambareesh 🇮🇳 ಸುಮಲತಾ ಅಂಬರೀಶ್ (@sumalathaA) July 6, 2020
కర్ణాటకలో ఇప్పటివరకూ 23, 474 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ 372 మంది చనిపోయారు.
Be the first to comment