వికాస్ దుబే అరెస్ట్… వెంటాడిన ఎన్‌కౌంటర్ భయం

లక్నో: గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే అరెస్టయ్యాడు. మధ్యప్రదేశ్ ఉజ్జెయిన్‌ మహాకాళేశ్వర్ మందిర్‌లో దాక్కున్న దుబేను పోలీసులు అరెస్ట్ చేశారు. తాను కాన్పూర్ వాలా వికాస్ దుబే అని, తనను పోలీసులు పట్టుకున్నారని గట్టిగా అరుస్తూ విలేకరులకు చెప్పాడు. పోలీసులు తనను ఎక్కడ ఎన్‌కౌంటర్ చేస్తారో అనే భయంతో తాను వికాస్ దుబే అని విలేకరులకు చెప్పాడు. ఈ నెల రెండున ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌ బిక్రూ గ్రామంలో వికాస్ దుబే జరిపిన కాల్పుల్లో డీసీపీ, ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు చనిపోయారు. ఇప్పటికే ఘటనకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటోన్న చౌబేపూర్ మాజీ స్టేషన్ ఆఫీసర్ వినయ్ తివారి, బీట్ ఇన్‌ఛార్జ్ కేకే శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ కాల్పులు జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్నా ఘటనాస్థలం నుంచి పారిపోయారు. మరోవైపు దుబే అనుచరుడు అమర్‌ దుబేను హమీర్‌పూర్ జిల్లాలో పోలీసులు ఎదురుకాల్పుల్లో హతమార్చారు. మొత్తం 100 పోలీసు బృందాలు దుబే కోసం యూపీ, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ జిల్లాల్లో జల్లెడపట్టాయి.

వికాస్ దుబే అరెస్ట్‌పై మధ్యప్రదేశ్ పోలీసులను సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ అభినందించారు.

వికాస్ దుబే అరెస్ట్‌పై సమాచారాన్ని యూపీ సీఎం యోగికి అందించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*