యూత్‌పవర్‌పై స్వామి బోధమయానంద ప్రత్యేక ఆన్‌లైన్ చర్చా కార్యక్రమం

హైదరాబాద్: రామకృష్ణ మఠంలో వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో బిల్డింగ్ ఎ రిసర్జంట్ ఇండియా త్రూ యాత్ పవర్ (యువశక్తి ద్వారా పటిష్ట భారత్ నిర్మాణం) అనే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం జరగనుంది. ఈ నెల 12న ఆన్‌లైన్ ద్వారా ఈ చర్చా కార్యక్రమం జరగనుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ చర్చా కార్యక్రమానికి వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ డైరక్టర్ స్వామి బోధమయానంద సంధానకర్తగా వ్యవహరిస్తారు. చీఫ్ గెస్ట్‌గా జస్టిస్ వి రామసుబ్రమణ్యన్ హాజరౌతారు. పశ్చిమబెంగాల్ నుంచి హెడ్‌మాస్టర్ బాబర్ అలీ, ఛత్తీస్‌గఢ్‌నుంచి విద్యావేత్త పవన్ దేశ్‌ముఖ్, బెంగళూరు నుంచి డిజైన్ ఇంజినీర్ సందీప్ వశిష్ట, జమ్మూ రామకృష్ణ మిషన్ నుంచి పీజీ విద్యార్ధి నోవిందర్ కుమార్, చెన్నై నుంచి కాస్ట్ ఎకౌంటంట్ కుమారి వాత్సల్య, విశాఖపట్టణం ఆంధ్రాయూనివర్సిటీ నుంచి యోగేశ్ బవన, హైదరాబాద్ నుంచి విద్యావేత్త కుమారి శ్రేయా ఠక్కర్, విద్యావేత్త కుమారి అఖిల నూకల తదితరులు వక్తలుగా పాల్గొంటారు. మరిన్ని వివరాలకు, లింక్ వివరాల కోసం hyderabad.vihe.rkmm.orgకి మెయిల్ చేయాలని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ డైరక్టర్ స్వామి బోధమయానంద తెలిపారు.

https://twitter.com/SwamiBODHAMAYA3/status/1280779743755857920/photo/1

ఆర్‌కే మఠ్‌లో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులు ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు.
మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.

-ఎన్.సాయి ప్రశాంతి, రామకృష్ణ మఠం వాలంటీర్, హైదరాబాద్.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*