
లక్నో: గ్యాంగ్స్టర్ వికాస్ దుబే అంతమయ్యాడు. అతడిని ప్రత్యేక వాహనంలో కాన్పూర్ తీసుకొస్తుండగా మార్గమధ్యంలో యాక్సిడెంట్ అయింది. ఆ సమయంలో పోలీసుల వద్ద ఉన్న 9ఎంఎం పిస్టల్ తీసుకుని పారిపోయేందుకు యత్నించగా దుబేపై పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో దుబే హతమయ్యాడు. ఘటనలో నలుగురు పోలీసులు గాయపడ్డారు.
#WATCH Forensic team arrives at the site of UP STF car convoy accident and encounter of #VikasDubey in Kanpur. pic.twitter.com/ktWoqguMWy
— ANI UP (@ANINewsUP) July 10, 2020
Kanpur: According to police, 4 policemen were injured after a car from UP STF convoy bringing back #VikasDubey from Madhya Pradesh, overturned today morning. pic.twitter.com/rI0RMpWXwz
— ANI UP (@ANINewsUP) July 10, 2020
Kanpur: Latest visuals from the site of UP STF car convoy accident and encounter of #VikasDubey in Kanpur.
Large number of people, police and media personnel seen in the area. pic.twitter.com/46hPDZ55R0
— ANI UP (@ANINewsUP) July 10, 2020
దుబే మృతదేహాన్ని కాన్పూర్లోని ఎలఎల్ఆర్ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్మార్టం జరుగుతోంది. మరోవైపు దుబే భార్యను, కుమారుడు ఆసుపత్రికి చేరుకున్నారు.
అంతకుముందు నిన్న మధ్యప్రదేశ్ ఉజ్జెయిన్లో మహాకాళేశ్వర్ మందిరంలో పోలీసులకు దొరికాడు.
జులై రెండున బిక్రూ గ్రామంలో డీఎస్పీ దేవేంద్ర మిశ్రాతో పాటు ముగ్గురు ఎస్ఐలను, నలుగురు కానిస్టేబుళ్లను దుబే గ్యాంగ్ కాల్చి చంపింది.
Be the first to comment