
హైదరాబాద్: కరోనా మహమ్మరి విజృంభిస్తోన్న తరుణంలో దానికి సరైన మందు యోగా మాత్రమేనంటున్నారు యోగా నిపుణులు లివాంకర్. భారతీయ సనాతన జీవన విధానాలే శ్రీరామ రక్ష అని చెబుతున్నారు.
కరోనాను ఎదుర్కోవడానికి రోగ నిరోధక శక్తి అతి ముఖ్యం. ఈ రోగ నిరోధక శక్తికి యోగా దివ్యమైన ఔషదం వంటిది. మనకు యోగాలో పలు రకాల ప్రాణాయామ విధానాలు ఉంటాయి. వాటిని ప్రాక్టీస్ చేస్తే కరోనా వైరస్ దాడి చేసే ఊపిరితిత్తులకు సామర్ధ్యం ఆటోమేటిక్గా పెరిగి అద్భుతమైన ఫలితాలు వస్తాయని లివాంకర్ చెబుతున్నారు.
గత ఎంతో కాలంగా హైదరాబాద్ రామకృష్ణమఠంలో ఎందరికో యోగా నేర్పిస్తున్నారు యోగా శిక్షకులు లివాంకర్. ఇప్పుడు కరోనా టైంలో ఆయన ఆన్లైన్ యోగా క్లాసులను అందిస్తున్నారు. ఈ ఆన్లైన్ క్లాసులు కరోనాపై విజయం సాధించేందుకు ఎంతగానో ఉపయోగడతాయని లివాంకర్ అంటున్నారు.
యోగా నిపుణులు లివాంకర్: 9676094092.
Be the first to comment