అమితాబ్‌, అభిషేక్‌కు పాజిటివ్.. ఆసుపత్రికి తరలింపు

ముంబై: ప్రముఖ సినీ నటుడు అమితాబ్ బచ్చన్‌కు, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు కరోనా సోకింది. పరీక్షలు చేయించుకోగా ఆయనకు, అభిషేక్‌కు పాజిటివ్ అని తేలింది. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని అభితాబ్ ట్వీటర్ ద్వారా వెల్లడించారు. కరోనాపై అమితాబ్ ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలు రూపొందించారు. అనేక వీడియా సందేశాలు ఇచ్చారు. జాగ్రత్తగా ఉండాలంటూ సోషల్ మీడియా ద్వారా కూడా ప్రజలను హెచ్చరించారు. గత పది రోజులుగా తనతో టచ్‌లో ఉన్నవారు కరోనా టెస్లులు చేయించుకోవాలని అమితాబ్ సూచించారు.

అభిషేక్ కూడా తనకు స్వల్పంగా కరోనా లక్షణాలున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు.

మరోవైపు అమితాబ్, అభిషేక్ త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు ప్రార్ధించారు. త్వరగా కోలుకోవాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ట్వీట్ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*