హార్ధిక్ పటేల్‌కు కీలక బాధ్యతలు అప్పగించిన సోనియా

గాంధీనగర్:కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హార్ధిక్ పటేల్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించారు. లోక్‌సభ ఎంపీలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ముగియగానే హార్ధిక్ పటేల్‌కు గుజరాత్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలనే నిర్ణయం వెలువడింది. పాటిదార్ సామాజిక వర్గానికి చెందిన యువనేతగా పేరున్న హార్ధిక్ పటేల్‌కు యూత్‌లో ఫాలోయింగ్ బాగుంది. దీంతో హార్ధిక్‌‌కు పార్టీ బాధ్యతలు అప్పగించడంలో రాహుల్ గాంధీ కీలకంగా వ్యవహరించారు. గుజరాత్ కాంగ్రెస్‌లో ఎందరో సీనియర్ నేతలున్నా పటేల్ సామాజికవర్గానికి ఉన్న ప్రాధాన్యతను బట్టి హార్ధిక్ ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. ‌

నరేంద్ర మోదీకి ముందునుంచే బీజేపీకి గుజరాత్ కంచుకోటలా మారింది. మోదీ తర్వాత కూడా బీజేపీ గుజరాత్‌లో విజయాలు సాధిస్తూ వస్తోంది. మోదీ, షా తర్వాత గుజరాత్‌లో ఆకర్షణీయమైన నాయకత్వం లేకపోవడంతో కాంగ్రెస్ గ్రాఫ్ క్రమంగా పెరుగుతోంది. ఈ తరుణంలో యువ నేత హార్ధిక్ పటేల్‌కు గుజరాత్ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*