భారత్‌లో 75 వేల కోట్ల రూపాయల పెట్టుబడి: గూగుల్ సిఈఓ

న్యూఢిల్లీ: రానున్న ఏడు సంవత్సరాల్లో భారత్‌లో 75 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని గూగుల్‌ సిఈఓ సుందర్‌ పిచాయ్‌ చెప్పారు. దేశంలో డిజిటల్‌ టెక్నాలజీ వినియోగాన్ని వేగవంతం చేసేందుకు గూగుల్‌ ఫర్‌ ఇండియా డిజిటైజేషన్‌ ఫండ్ ద్వారా నిధులను వెచ్చిస్తామని గూగుల్‌ ఫర్‌ ఇండియా వార్షిక సమావేశంలో ప్రకటించారు. అంతకు ముందు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. దేశంలో ఇంటర్నెట్‌ సేవల వినియోగాన్ని చౌకగా, ప్రయోజనకరంగా మార్చాల్సి ఉందని పిచాయ్ చెప్పారు.

ఈక్విటీ పెట్టుబడులు, భాగస్వామ్యాలు, కార్యాచరణ ప్రణాళికలు, మౌలిక వసతుల వంటి వాటి ద్వారా పెట్టుబడులు సమకూరుస్తామమని సుందర్ పిచాయ్ చెప్పారు.

సుందర్‌ పిచాయ్‌తో చర్చ ఫలప్రదంగా జరిగిందంటూ మోదీ ట్వీట్ చేశారు.

దీనిపై స్పందించిన పిచాయ్ సమయం కేటాయించినందుకు మోదీకి ధన్యవాదాలు చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*