
జైపూర్: రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ కొత్త పార్టీ పెట్టనున్నారు. జైపూర్‌లో ఈరోజు జరిగిన సీఎల్పీ సమావేశానికి ఆయన గైర్హాజరయ్యారు. ఆయనకు మద్దతిస్తున్న 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలుకూడా డుమ్మా కొట్టారు. గెహ్లాట్‌తో సర్దుబాటు అసాధ్యమని తేల్చిన ఆయన కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. పైలట్ కొత్త పార్టీ పెడితే గెహ్లాట్ సర్కారుకు మెజార్టీ లేదు కనుక పడిపోయే అవకాశముంది. గవర్నర్ విశ్వాస పరీక్షకు ఆదేశించే అవకాశాలున్నాయి.
200 మంది సభ్యులున్న రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 107 మంది ఎమ్మెల్యేలుండగా 18 మంది సచిన్ వెంట వెళ్లారు. బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేలున్నారు.
సీనియర్లు నచ్చచెప్పినా వినని సచిన్ పైలట్‌పై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. షోకాజ్ నోటీసు జారీ చేయనుంది.
Be the first to comment