తనపై వేటు పడ్డాక పైలట్ ట్వీట్.. కాసేపట్లో మీడియా సమావేశం

జైపూర్: రాజస్థాన్‌ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్‌పై కాంగ్రెస్ పార్టీ వేటేసింది. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. డిప్యూటీ సీఎం పదవి నుంచి కూడా తొలగించింది. పైలట్‌కు మద్దతిస్తున్న ముగ్గురు మంత్రులను కూడా పార్టీ నుంచి తొలగించింది. పైలట్‌పై వేటెయ్యక తప్పలేదని సీఎం గెహ్లాట్ తెలిపారు. ఆరు నెలలుగా పైలట్ తీరు తేడాగా ఉందన్నారు. మరోవైపు తాజా పరిణామాలను అధినేత్రి సోనియాకు వెల్లడించేందుకు ప్రియాంకా వాద్రా భేటీ అయ్యారు.

తనపై వేటు పడ్డాక సచిన్ పైలట్ ట్వీట్ చేశారు. సత్యాన్ని ఇబ్బంది పెట్టగలరు కానీ ఓడించలేరంటూ ట్వీట్ చేశారు. పైలట్ కొత్త పార్టీ పెట్టనున్నారు.

మరోవైపు జైపూర్‌లో ఈరోజు జరిగిన సీఎల్‌పీ సమావేశానికి పైలట్ గైర్హాజరయ్యారు. ఆయనకు మద్దతిస్తున్న 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలుకూడా డుమ్మా కొట్టారు. పైలట్ కొత్త పార్టీ పెడితే గెహ్లాట్ సర్కారుకు మెజార్టీ లేదు కనుక పడిపోయే అవకాశముంది.

200 మంది సభ్యులున్న రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 107 మంది ఎమ్మెల్యేలుండగా 18 మంది సచిన్ వెంట వెళ్లారు. బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేలున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*