
న్యూఢిల్లీ: నిన్న రాజస్థాన్ పీసీసీ పదవి, డిప్యూటీ సీఎం పదవి కోల్పోయిన సచిన్ పైలట్ ఎమ్మెల్యే పదవి కూడా కోల్పోనున్నారు. పైలట్‌కు మద్దతిస్తున్న 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కానుంది. రాజస్థాన్ స్పీకర్ కార్యాలయం నుంచి వీరందరికీ నోటీసులు పంపారు. శుక్రవారంలోగా సమాధానం చెప్పాలని కోరారు. పార్టీ బదలాయింపు చట్టం ప్రకారం ఈ నోటీసులు పంపారు. నోటీసుల రూపంలో కాంగ్రెస్ చేస్తున్న ఒత్తిడి ఫలిస్తే పైలట్ వెంట ఎమ్మెల్యేలు మళ్లీ గెహ్లాట్ చెంత చేరే అవకాశం ఉంది.
మరోవైపు తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, బీజేపీలో చేరుతున్నట్లుగా కొందరు పనికట్టుకుని ప్రచారం చేస్తున్నారని పైలట్ చెప్పారు. బీజేపీలో చేరడం తప్పిదమవుతుందని తాను భావిస్తున్నానని చెప్పారు. గత ఆరు నెలలుగా తాను జ్యోతిరాదిత్య సింధియాతో కానీ, బీజేపీ నేతలతో కానీ టచ్‌లో లేనని పైలట్ స్పష్టం చేశారు.
Be the first to comment