బీజేపీలో చేరను: సచిన్ పైలట్

న్యూఢిల్లీ: తాను భారతీయ జనతా పార్టీలో చేరబోవడం లేదని సచిన్ పైలట్ చెప్పారు. మరికాసేపట్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈలోగా ఆయన జాతీయ మీడియాకు సమాచారం ఇచ్చారు. తాను బీజేపీలో చేరబోనన్నారు. తాను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పారు. గత ఆరునెలల్లో తాను జ్యోతిరాదిత్య సింధియాను కలవలేదని స్పష్టం చేశారు. తాను బీజేపీ నేతలను కలవలేదన్నారు. తదుపరి కార్యాచరణను పైలట్ కాసేపట్లో ప్రకటించనున్నారు.

నిన్న పైలట్‌ను రాజస్థాన్ పీసీసీ అధ్యక్ష పదవినుంచి, డిప్యూటీ సీఎం పదవినుంచి కాంగ్రెస్ పార్టీ తొలగించింది.

తన వద్ద 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్ల మద్దతు ఉందని పైలట్ చెప్పారు. దీంతో 200 మంది సభ్యులున్న రాజస్థాన్ అసెంబ్లీలో అధికారంలో కొనసాగడానికి కావాల్సిన 101 మంది సభ్యుల మద్దతు గెహ్లాట్‌కు లేదని తెలుస్తోంది. బీజేపీ ఇప్పటికే విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని గెహ్లాట్‌ను కోరింది.

మరోవైపు మాజీ సీఎం వసుంధరా రాజే నేతృత్వంలో బీజేపీ నేడు కీలక సమావేశం నిర్వహించనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*